FbTelugu

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నేటినుంచి శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామి దేవాలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటినుంచి ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల(జనవరి) 17 వరకు జరుగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని, శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇందుకోసం ఇప్పటికే వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్పవాలకు ప్రారంభ పూజలు ప్రారంభించారు. నేడు (సోమవారం) యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ నిర్వహించనున్నారు. మంగళవారం భృంగివాహన సేవ, ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు. బుధవారం రావణవాహన సేవ, గురువారం నందివాహన సేవ, కళ్యాణ మహోత్సవం, శుక్రవారం కైలాస వాహన సేవ, శనివారం రుద్ర చండీయాగాలకు పూర్ణాహుతి, త్రిశాలస్నానం, ధ్వజావరోహణ, ఆదివారం అశ్వవాహన సేవ ఆలయోత్సవం, పుష్పోత్సవ, శయనోత్సవసేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.