FbTelugu

కోకిలా బెన్ హాస్పిటల్ కు సంజూ

ముంబై: ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న హీరో సంజయ్ దత్ కోకిలా బెన్ హాస్పిటల్ లో శనివారం సాయంత్రం చేరుకున్నారు. కరోనా పరీక్షల కోసం ఈ నెల 8న లీలావతి హాస్పిటల్ వెళ్లగా క్యాన్సర్ బయటపడిన విషయం తెలిసిందే.

క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్న సంజూ కోకిలాబెన్ హాస్పిటల్ వెళ్లే ముందు ఫిల్మ్ ఫొటోగ్రాఫర్లను పలకరించారు. వారికి అభివాదం చేస్తూ లోనికి వెళ్లారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు, సహచర నటులు భగవంతుడిని ప్రార్థించారు. ఆందోళన చెందవద్దని, పుకార్లు నమ్మవద్దని భార్య మాన్యతా దత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

You might also like