FbTelugu

డీజీపీ కి బండి సంజయ్ వార్నింగ్

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ భారత్ బంద్ కు టీఆర్ఎస్ కు సహకరించిన విధంగానే తమకు సహకరించాలని ఆయన కోరారు.
ఇవాళ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే డీజీపీ పూర్తిగా సహకరించారన్నారు. మున్ముందు చేసే ఆందోళనలు, ధర్నాలకు కూడా సహకరించకపోతే ఏం చేయాలో అది చేస్తామని ఆయన హెచ్చరించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడారు. రైతు సమస్యలపై కిసాన్ మోర్చా సమావేశాలు జరుగుతున్నాయని, మండలాలు, జిల్లాల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. ఆ తరువాత ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ కో న్యాయం, ప్రతిపక్షాలకో న్యాయమంటే కుదరదన్నారు.
సన్నాలకు మద్ధతు ధర ఏమైందని సంజయ్ ప్రశ్నించారు.

నిన్నటి దాకా ఫామ్ హౌస్ లో పడుకున్న ఆయనకు వ్యవసాయ చట్టం ఇప్పుడు గుర్తువచ్చిందా అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో అధికారిక బంద్ నిర్వహించిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై త్వరలో ఉద్యమిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీఓఎస్ నాయకులు మాట్లాడ్డం లేదని, సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని సంజయ్ ఆరోపించారు. సంఘం నాయకులు టీఆర్ఎస్ కు తాబేదార్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.