FbTelugu

కేసీఆర్ విశ్వాస ఘాతకుడు: సంజయ్

హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీవీ.నరసింహారావు ఘాట్, అంజయ్య లుంబినీ పార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ సమాధికి బీజేపీ రక్షణగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇవాళ ఆయన పీవీ ఘాట్, ఎన్టీఆర్ సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చుతామని హెచ్చరించిన ఎంఐఎం పార్టీ శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ని టీడీపీ నాయకులు విమర్శించకుండా నన్ను టార్గెట్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం మూర్ఖులు కూల్చుతామని అంటున్నారు. వారి కాలి గోటికి కూడీ మజ్లిస్ నాయకులు సరిపోరని ఆయన అన్నారు.

అక్బర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం మూర్ఖత్వానికి నిదర్శనమని సంజయ్ అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే అక్బర్ పై విమర్శలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. విశ్వాస ఘాతకుడు కేసీఆర్, ఆయన పేరు ను తన కుమారుడికి పెట్టుకున్నాడన్నారు. టీడీపీలో పెరిగి పెద్దయి, అదే పార్టీ అధినేత ను విమర్శిస్తుంటే కేసీఆర్ మౌనం వహిస్తున్నాడన్నారు. నీకు విశ్వాసం ఉన్నా, అభిమానం ఉంటే వెంటనే అక్బరుద్దీన్ పై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.