FbTelugu

‘మహా’ రాజకీయ నాటకం

Sanjay-Raut-To-Meet-Maharashtra-Governor

తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లలో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాకపోవడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా మారింది. బీజేపీ శివసేన పార్టీలు కలిసి భరిలోకి దిగిన సంగతి తెలిసిందే కానీ ముఖ్యమంత్రి పదవి తమకే కావాలంటూ శివసేన పట్టుపడుతోంది. ఈ క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొషియారితో సమావేశం కానుంది. గవర్నర్‌తో శివసేన నేతల భేటీని గవర్నర్‌ కార్యాలయం నిర్ధారించింది. కాగా, మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకైక​ అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలని కోరతానని రౌత్‌ స్పష్టం చేశారు. చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న శివసేన ప్రతిపాదనను బీజేపీ తోసిపుచ్చుతోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఎన్సీపీ సంకేతాలు పంపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

You might also like