FbTelugu

కడపలో శానిటైజర్ దారుణం…

కడప: మద్యం ధరలు అమాంతం పెంచడంతో పేదవాళ్లు మత్తు కోసం శానిటైజర్లను సేవించి విలువైన ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఘటన మరువక ముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకున్నది.

శానిటైజర్ సేవించిన వారిలో ముగ్గురు చనిపోగా, మరో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. పెండ్లిమర్రిలో 10 మంది మందు బాబులు మత్తు కోసం శానిటైజర్ తాగారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా మృతుల బంధువులు, స్థానిక నాయకులు వెంటనే అంత్యక్రియలు చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగి  ఘటనపై విచారణ చేపట్టారు. ముగ్గురు మృతులు ఓబులేషు, చెన్నకేశవులు, భీమయ్యగా గుర్తించారు.

You might also like