FbTelugu

10 కి చేరిన ‘శానిటైజర్’ మృతులు

ప్రకాశం : కురిచేడులో మరణమృదంగం కొనసాగుతోంది. కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగి మృతి చెందారని అనుమానిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ప్రస్తుతం మృతుల సంఖ్య 10 కి చేరింది. నిన్న రాత్రి వరకు ముగ్గురు మృతి చెందగా.. ఇవాళ ఉదయానికి మరో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం మరోకరు మృతి చెందినట్టు సమాచారం. దీంతో మొత్తం మూడు రోజుల వ్యవధిలో 10 మంది మృత్యువాత పడ్డారు.

మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రకాశం జిల్లా కురిచేడులో 10మంది దుర్మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మద్యం మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల ఈ విధమైన దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like