FbTelugu

శానిటైజర్ మృతులు 20 మంది

ప్రకాశం: జిల్లాలో శానిటైజర్‌ తాగిన ఘటనలో తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారం వ్యవధిలో జిల్లాలో శానిటైజర్‌ మృతుల సంఖ్య 20కి చేరింది.

కురిచేడులో శనివారం వరకూ 15 మంది మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాకాని గురవయ్య(45), ఒంగోలు నెహ్రూనగర్‌లో దుర్గాప్రసాద్‌(35) మృతి చెందాడు. దీంతో ఒక్క కురిచేడు ఘటనలోనే 17 మంది మృత్యువాతపడ్డారు. అదనంగా మరో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిని కలిపితే మొత్తం 20 మంది వరకు చనిపోయారు. కురిచేడుకు చెందిన సుమారు 40 మంది బాధితులు ఒంగోలు రిమ్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

You might also like