FbTelugu

శానిటైజర్, సిగరెట్… ప్రాణగండం తప్పింది!

వాషింగ్టన్: శానిటైజర్ వినియోగించే సమయంలో ఆటలాడవద్దని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నా, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా అక్కడక్కడా కొందరు నిర్లక్ష్యం వహిస్తునే ఉన్నారు.

కరోనా కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ తో శానిటైజర్ వాడుతున్నారు. బయటకు వెళ్లిన సందర్భంలో దీని వినియోగం పెరిగింది. అమెరికాలోని రాక్ విల్లే షాపింగ్ సెంటర్ పార్కింగ్ ప్రాంతంలో ఒక వ్యక్తి కారులో కూర్చుని సిగరెట్ కాల్చుతున్నాడు. అదే సమయంలో జేబులో నుంచి శానిటైజర్ తీసి చేతులు శుభ్రం చేసుకున్నాడు. ఆ క్రమంలో నాలుగైదు చుక్కలు అతని డ్రెస్స్ పై పడి, సిగరెట్ నుంచి నిప్పు రవ్వలు కూడా పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే బతుకు జీవుడా అంటూ కారులో నుంచి బయటకు దూకేశాడు. బయటకు దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. స్వల్ప గాయాలు కావడంతో అతన్ని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. కారు దహనం అవుతున్న ఫైర్ స్టేషన్ ఫోన్ లో చెప్పగా, ఫైరింజన్ వచ్చే లోగానే కారు పూర్తిగా దహనం అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.