FbTelugu

సోనియా మాజీ సలహాదారు అహ్మద్ పటేల్ మృతి

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఇవ్వాళ ఉదయం మృతి చెందారు.
గత కొద్దరోజులుగా ఆయన కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నాడు. ఇవ్వాళ తెల్లవారు జామున చనిపోయారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పటేల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.