FbTelugu

‘‘సందేశ్’’ మెసేజ్ యాప్ వచ్చేసింది…

న్యూఢిల్లీ: వాట్సప్ మెసేజింగ్ యాప్ కు పోటీగా దీటుగా భారత ప్రభుత్వం ‘‘సందేశ్’’ స్వదేశీ యాప్ ను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ను నేషనల్ ఇన్ఫార్మిటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది. ఐ ఫోన్ వినియోగదారులకు యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించగా, ఆండ్రాయిడ్ యూజర్స్ కు మాత్రం జిమ్స్ వెబ్ ఫోర్టల్ నుంచి ఏపీకే డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సమాచార గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ సౌకర్యం ఇచ్చారు. దీంతో పాటు సంవాద్ పేరుతో మరో మెసేజింగ్ యాప్ ను తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కూడా వ్యక్తిగత, గ్రూప్ మెసేజింగ్, ఆడియో, వీడియో ఫైల్ షేరింగ్ వంటి అన్ని ఫీచర్లు ఉండనున్నాయి.

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సమాచార గోప్యతా విధానం ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా అలజడి మొదలైంది. తమ సమాచారాన్ని ఫేస్ బుక్ తో పంచుకుంటున్నట్లు ప్రకటించడంతో పలువురు ఇతర మెసేజింగ్ యాప్ ల వైపు మళ్లారు. పలువురు సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. దేశ రక్షణ, పౌరుల సమాచార గోప్యత కోసం భారత ప్రభుత్వం సందేశ్ యాప్ తీసుకువచ్చింది. దీంతో పాటుగా సంవాద్ యాప్ ను తీసుకువస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.