FbTelugu

14 నుంచి ఇసుక వారోత్సవాలు: జగన్

ఆంధ్రప్రదేశ్: నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు జరుపనున్నట్టు ఎపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెళ్లడించారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80వేల టన్నులు ఉండగా.. వరదల కారణంగా, రీచ్‌లు మునిగిపోయిన కారణంగా.. ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయాంమని తెలిపారు. గత వారంరోజులుగా ఈ పరిస్థితి మెరుగుడు పడిందన్నారు. 1.20 లక్షల టన్నులకు రోజువారీ పెరిగిందని తెలిపారు. రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరిందన్నారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారంరోజుల్లో పెంచాలన్నారు. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయిట్లు పెంచాలన్నారు. జేసీలను ఇన్‌ఛార్జీలుగా పెట్టాం కాబట్టి, వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలని సూచించారు.

వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్‌ పాయింట్లు ఉండాలన్నారు. నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలన్నారు. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్‌ చేయాలన్నారు. ఎవరైనా ఎక్కువ అమ్మితే పెనాల్టీ, సీజ్‌, 2 ఏళ్ల వరకూ జైలుశిక్ష ఉంటుందని తెలిపారు. దీనికి రేపు కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకుంటామన్నారు. జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని సూచించారు. ఇసుక కొరత తీరేంతవరకూ ఎవ్వరూడా సెలవులు తీసుకోకూడదన్నారు. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలన్నారు. వీడియో కెమెరాలు అమర్చాలని చూసించారు. 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలిన్నారు.

దీనికోసం కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌ అండ్‌ బి, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపాడు. అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

You might also like