FbTelugu

ఆర్టీసి బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ

వరంగల్: శాయంపేట మండలం మందారి పేట శివారు లో ఆర్టీసి బస్సును ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ ఘటనలో గాయపడిన వారికి పరకాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. హన్మకొండ నుంచి భూపాలపల్లి కి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ను ఇసుక లారీ ఢీ కొట్టిందని ప్రయాణీకులు తెలిపారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని, ఈ ఘటన లో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు అయిందన్నారు. పరకాల ఆర్టీసీ డిపో కు చెందిన బస్సులో హన్మకొండ నుంచి బయలుదేరామని ప్రయాణీకులు చెప్పారు. ఇసుక లారీ పల్టీలు కొట్టి రోడ్డు పక్కగా పడిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.