FbTelugu

ఇసుక లారీ బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం

విశాఖపట్నం: ఇసుక లారీ మరో లారీని ఢీకొట్టి బోల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలైన ఘటన విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం సమీపంలో హైవేపై చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ప్రమాదవశాత్తు ఓ ఇసుక లారీ మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ కు తీవ్రగాయాలైనాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

You might also like