FbTelugu

గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలా: బండి సంజయ్

హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన నిరసనలకు బీజేపీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
గణేశ్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందన్నారు. రంజాన్, బక్రీద్ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛను, బోనాలు, వినాయక చవితి సందర్భంగా విధించిన ఆంక్షలను ప్రజలు గమనించారన్నారు.

సోమవారం జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వినాయక మంటపాలు తొలగించిన స్థలాల్లో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యకర్తలను సంజయ్ కోరారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన ప్రదర్శించాలి. రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులు ధర్మ పరిరక్షణ కోసం స్పందించాలన్నారు. ఎంఐఎం పార్టీ ఓవైసీల మెప్పు, ఓ వర్గం ప్రజల సంతుష్టీకరణ కోసం సీఎం కేసీఆర్ నవరాత్రి ఉత్సవాలపై నిర్బంధంగా వ్యవహరిస్తున్నారు. హిందువునని చెప్పుకునే కేసీఆర్, పండుగ పూట హిందువుల్ని భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

You might also like