FbTelugu

శ్రీశైలంలో ఆంక్షలు… అన్నవరంలో బంద్

కర్నూలు: కరోనా మహమ్మారి నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈఓ కెఎస్‌.రామారావు తెలిపారు.
సెకండ్ వేవ్ తీవ్రత ఉన్నందున ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని, పరోక్ష సేవలను భక్తులు దేవస్థానం ఛానల్‌లో వీక్షించవచ్చని ఆయన వెల్లడించారు. దేవస్థాన పరిపాలనా విభాగంతోపాటు అర్చక పండితుల్లో ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల సిబ్బంది అత్యవసరమైతేనే కార్యాలయాలకు రావాలని ఆయన కోరారు.

అన్నవరంలో సేవలు బంద్…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని అన్నవరం దేవస్థానం కార్య నిర్వహణాధికారి తెలిపారు. శ్రీ స్వామివారికి నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ ఏకాంతంగా శాస్త్ర ప్రకారంగా నిర్వహించబడును.అన్నవరం దేవస్థానం నందు నిర్వహించు అర్జిత సేవలు (వ్రతములు, స్వామి వారి నిత్య కళ్యాణం, ఆయుష్ హోమము, చండీ హోమము) మొదలగు సేవలు భక్తులు పరోక్షంగా మాత్రమే (Online) ద్వారా సదరు సేవలను నిర్వహించుకొనవచ్చునని తెలిపారు. భక్తులు పరోక్ష సేవల నిమిత్తం ఫోన్ నెంబర్లు.9491249990, 9491249991 సంప్రదించగలరు.

You might also like

Leave A Reply

Your email address will not be published.