FbTelugu

గుంటూరు జిల్లాలో మళ్లీ ఆంక్షలు

గుంటూరు: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి 11 వరకు మాత్రమే షాపులు తెరచి ఉంటాయని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలి
ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలుకు ఈ సమయంలోనే అనుమతించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నిబంధనలు ఒక వారం రోజులపాటు అమలులో ఉంటాయన్నారు. రోడ్ల ప్రక్కన, బండ్లపై జరిపే చిరు వ్యాపారాలకు, అంగళ్ళకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.

అత్యవసరంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలన్నారు. అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

You might also like