FbTelugu

చైనాలో శాంసంగ్ కంపెనీ పాక్షిక మూత

బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ చైనాలో కంప్యూటర్ల ఉత్పత్తిని నిలిపివేసింది. సుజోవ్ లో ఇక నుంచి కంప్యూటర్ల ఉత్పత్తిని ఉండదని  అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ కంపెనీలో ఉత్పత్తి ని మాత్రమే నిలిపివేస్తున్నామని, పరిశోధన పనులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ కంపెనీలో సుమారు 1700 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తుండగా, సగం మందిని తొలగించారు. ప్రధాన కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో చైనాలో కంపెనీలను కొనసాగించేందుకు పలు దేశాలు ఇష్టపడడం లేదు.

కరోనా వైరస్ ప్రధాన కారణం అయినప్పటికీ వేతనాల సాకు చూపి కంపెనీల తరలింపు, పాక్షిక మూత, శాశ్వత మూతపై నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తున్నారు. గతేడాది స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీని కూడా శాంసంగ్ మూసివేసిన విషయం తెలిసిందే.

You might also like