FbTelugu

మామ బర్త్ డే సీడీపీ వదిలిన సమంత

ఈ మధ్య సోషల్ మీడియాలో బర్త్ డే సీడీపీ ట్యాగ్ హవా నడుస్తోంది. దీన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

తాజాగా హీరో మహేష్ బాబు బర్త్ డే ట్యాగ్ ను విడుదల చేయగా, దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ సీడీపీ రిలీజు చేయగా వరల్డ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా అభిమాన హీరోను టాప్ పొజిషనల్ నిలబెట్టేందుకు అభిమానులు అంతగా పోరాడుతున్నారు.

హీరో నాగార్జున బర్త్ డే ఆగస్టు 29ని పురస్కరించుకుని ఆయన కోడలు సమంత సీడీపీని విడుదల చేసింది. దీన్ని విడుల చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. వారం ముందే విడుదల చేయడంతో అభిమానులు సమంతకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

You might also like