FbTelugu

‘పుష్ప’ సమంత ఐటమ్ సాంగ్.. ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా

సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఆ కిక్కే వేరప్ప. అలాంటి సుక్కుతో అల్లు అర్జున్ తోడైతే ఆ దూకుడును ఆపగలమా? బన్నీ స్పీడుకు సమంత యాడ్ అయితే ఇంకేమన్నా ఉందా? పుష్ప సినిమాలో అదే చేసి చూపించబోతున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. తనలోని క్రియేటివిటీకి పదును పెడుతూ ఐటెం సాంగ్ కోసం సమంతను రంగంలోకి దించిన సుక్కు.. ఆమెతో ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అంటూ మాస్ ఆడియన్స్‌కి చెమటలు పట్టించారు.

తాజాగా ‘పుష్ప’ నుంచి సమంత ఐటెం సాంగ్ వదిలారు సుకుమార్. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ మాస్ బీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ”ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ, మీ మగ బుద్దే వంకర బుద్ది” అనే పదునైన పదాలకు రొమాంటిక్ డోస్ దట్టించి సమంత అందాలను కెమెరాలో బంధించారు సుకుమార్. చంద్రబోస్‌ సాహిత్యంలో దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కట్టిన ఈ స్పెషల్ సాంగ్ నెట్టింట రచ్చ చేస్తోంది. విడాకుల తర్వాత సమంత గ్రేస్ చూసి క్లాస్, మాస్ అంతా ఫిదా అవుతున్నారు. ఇంద్రావతి చౌహాన్‌ ఈ పాటను ఆలపించారు. ఈ వీడియోలో బన్నీ మాస్ లుక్ చూపించి చూపిస్తూ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశారు మేకర్స్.

You might also like

Leave A Reply

Your email address will not be published.