FbTelugu

సమంత.. పట్టుకోండి చూద్దాం….

సమంత.. పట్టుకోండి చూద్దాం అనేంత స్పీడుగా వరుస సినిమాల్లో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్ప‌టికే రెండు ద్వి భాషా చిత్రాల‌ను అనౌన్స్ చేసిన స‌మంత ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది అది ఏకంగా గ్లోబ‌ల్ మూవీ. ‘ది అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ పేరుతో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీని అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ పిలిప్ జాన్ ఈ సినిమాను తెర‌కెక్కింస్తున్నారు. గురు ఫిలింస్ బ్యాన‌ర్‌పై సునీత తాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స‌మంత అను అనే పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆమె తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఓ స‌రికొత్త ప్ర‌పంచం. ‘అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’లో భాగం కావ‌డాన్ని థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. అను అనే పాత్ర‌కు నన్ను ఎంపిక చేసుకున్నందుకు ద‌ర్శ‌కుడు పిలిప్ జాన్‌కు ధ‌న్య‌వాదాలు’’ అని తెలిపారు స‌మంత‌. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్‌లో చేయ‌న‌టువంటి స‌రికొత్త పాత్ర‌ను అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ చిత్రంలో చేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.