FbTelugu

 మమతకు మద్దతుగా ప్రచారం చేస్తాం: అఖిలేష్

లక్నో: పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్‌కు అండగా ఉంటామని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఆ పార్టీకి మద్దతుగా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహిస్తామని తెలిపారు.

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో మిత్రపక్షంగా వ్యవహరిస్తామని, సెక్యులర్ శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రాంతీయ పార్టీలను చిదిమేసి దీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో ఉండేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ పోరాడుతున్నదని అఖిలేష్ యాదవ్ కితాబునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.