FbTelugu

రామ మందిరం నిధుల గోల్ మాల్

లక్నో: రామ మందిరం పేరుతో రామభక్తులను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు మోసగించిందని సమాజ్ వాదీ నేత పవన్ పాండే, ఆప్ ఎంపి సంజయ్ సింగ్ లు ఆరోపణలు చేశారు.

అయోధ్యలో రామ మందిరం పేరుతో ట్రస్టు సభ్యులు కోట్లు వెనకేసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఇద్దరు నాయకులు వేర్వేరుగా మీడియా సమావేశం నిర్వహించి ట్రస్టుపై పలు ఆరోపణలు చేశారు. అయోధ్యలో రూ.2 కోట్ల విలువ చేసే భూములను ట్రస్టు రూ.18.5 కోట్లు కొనుగోలు చేసినట్లు సంజయ్ సింగ్ ఆరోపించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాలతోనే ఈ చెల్లింపులు జరిగాయన్నారు. సమాజ్ వాదీ నేత పవన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భూమి విలువను 10 రెట్లు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలో 2021 మార్చిలో ఆలయం కోసం భూమి కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ విలువ ఆ సమయంలో రూ.2 కోట్లుగా చూపించారన్నారు. పది నిమిషాల తరువాత ట్రస్టుకు, విక్రయదారుడికి మద్య రూ.18 కోట్ల అగ్రిమెంటు జరిగిందన్నారు. ప్రజల నుంచి వసూలు అయిన కోట్లాది రూపాయలు ఇలా దారి మళ్లిస్తూ దోపిడి చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
భూముల కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పక్కాగా జరిగిందని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టం చేశారు. ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.3200 కోట్లు సమకూరాయని అన్నారు. రామ మందిరం 2024 కల్లా పూర్తి చేస్తామని, అక్టోబర్ కల్లా ఆలయ పునాది పనులు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.