FbTelugu

ట్రాన్స్ జెండర్ల కోసం ఫిర్యాదు కేంద్రం: సజ్జనార్

సైబారాబాద్: ట్రాన్స్ జెండర్ల సమస్యలు పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద పోలీసు కమిషనర్ విసి.సజ్జనార్ తెలిపారు.
మహిళా, శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుందని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. చందాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.

సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సుమారు 150 మంది ట్రాన్స్ జెండర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే 9490617444 వాట్సప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ కోరారు.
ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలపై న్యాయం జరిగేలా చూస్తానని సజ్జనార్ హామీ ఇచ్చారు. సమాజంలో తాము నిరాదరణకు గురవుతున్నామని, సంక్షేమ పథకాలు అమలు చేయించాలని వారు కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.