FbTelugu

సజ్జల, ప్రవీణ్ ను తొలగించాలి: ఎస్ఈసీ లేఖ

విజయవాడ: ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జల రామకృష్టా రెడ్డిని తొలగించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు.

అదే విధంగా సీఎం వైఎస్.జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సంప్రదింపులు జరపకుండా నిషేధం విధించాలని కోరింది. ఆయనను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని కొద్ది రోజులుగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశం నిర్వహించి వ్యక్తిగతంగా దూషించడంతో నిమ్మగడ్డ సీరియస్ గా పరిగణించారు. ఈయన వ్యవహారశైలిపై నేరుగా గవర్నర్ కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. సజ్జల దూషణలపై భారత అటార్నీ జనరల్ నుంచి అభిప్రాయం తీసుకోవాలని నిమ్మగడ్డ నిర్ణయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.