FbTelugu

వాట్సప్ లో వచ్చే వార్తలు నమ్మొద్దు: సైరభాను

ముంబయి: పాతతరం బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆరోగ్యం బాగాలేదని వాట్సప్ లో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని ఆయన భార్య సైరభాను స్పష్టం చేశారు.

ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, మీరు దిలీప్ కుమార్ పట్ల చూపిస్తున్న ప్రమాభిమానాలకు, ఆరోగ్యం కోసం చేస్తున్న ప్రార్ధనలకు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో ఆదివారం ఉదయం ముంబయిలోని కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని వాట్సప్ లలో మెస్సేజ్ లు తెగ వైరల్ అవుతున్నాయి. తప్పుడు వార్తలపై దిలీప్ కుమార్ భార్య సైరభాను ట్వీట్ చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారని వైద్యులు తెలిపారని ఆమె వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.