FbTelugu

‘పాత బస్తీలో 5 కిలోమీటర్ల మెట్రో’! : మెట్రో ఎండీ

హైదరాబాద్: పాతబస్తీలో 5 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో దశలో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

రెండో దశలోనే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు, లక్డీ కపూల్  నుంచి ఎయిర్పోర్ట్ కు  నూతన రూట్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఆలోచన ఉందని తెలిపారు. ప్రయాణీకుల నుంచి L&T కి రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు.

మెట్రో మాల్స్ నుంచి నెలకు 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. టికెట్స్,  మాల్స్ నుంచి నెలకు L&T కి సుమారు మొత్తం 40 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు 269 ఎకరాల భూమి ఇచ్చిందని, ఎక్కువ సమయం పట్టడంతో నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలిపాడు.
తిరుమల కొండపైకి మెట్రో కోసం 3 రోజులు సర్వే:
తిరుమల కొండపైకి మెట్రో సేవల కోసం 3 రోజులు సర్వే చేసినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే తిరుమల మొత్తం
రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్నట్టు తెలిపారు. తిరుమల జర్నీకి మంచి పరిష్కారం తీసుకువస్తామన్నారు. కాగా తిరుమలలో పొల్యూషన్ తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతికి మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని, తిరుమల ప్రాజెక్టు పై నిర్ణయం తీసుకుంటే ప్రయత్నాలు మొదలవుతాయని తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More