FbTelugu

హీరోయిన్ గా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్

హీరోయిన్ గా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్

ఒక సామాన్యమైన అమ్మాయిగా వెండి తెరకు పరిచయమయిన సాయిపల్లవి తన సహజమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. తమిళంలోనే కాకుండా, ‘ఫిదా’ .. ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో తెలుగులోను స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఇప్పుడు సాయిపల్లవి చెల్లెలు పూజ కన్నన్ కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది .. అదీ ఒక తమిళ సినిమా ద్వారా. యాక్షన్ డైరక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ‘సిల్వా’ .. దర్శకుడిగా ‘చితిరై సెవ్వానం’ అనే సినిమాను రూపొందించాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ ఈ కథ నడుస్తుంది. తండ్రి పాత్రలో సముద్రఖని .. కూతురు పాత్రలో పూజ కన్నన్ కనిపించనున్నారు.

అమృత స్టూడియోస్ వారి నిర్మాణం లో ఈ సినిమాను నిర్మించారు. జీ 5 తమిళంలో ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.