FbTelugu

 మరో మూడు రోజుల్లో నిండనున్న సాగర్

హైదరాబాద్: వారం రోజులుగా ఎడతెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తున్నది. ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం పోటెత్తడంతో శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు అధికమైంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 195 టీఎంలకు చేరుకున్నది. జలాశయం నీటి మట్టం పెరుగుతుండడంతో బుధవారం నాడు ఇంజనీర్లు మూడు గేట్లను ఎత్తివేసి సాగర్ లోకి వదిలారు. తుంగభద్ర జలాశయం ఇప్పటికే నిండిపోగా, నారాయణపూర్, జూరాలకు కూడా నీటి ఉధృతి తగ్గడం లేదు.

నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గా ఇప్పటికే 260 టీఎంసీలు గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడానికి మరో 52 టీఎంసీల నీరు అవసరం. ఎగువ ప్రాంతం నుంచి వరదనీటి ప్రవాహం అధికంగా ఉండడంతో మూడు నాలుగు రోజుల్లో సాగర్ జలాశయం నిండిపోతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. శ్రీరాం సాగర్ పూర్తి నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా 61 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
వరద నిటి ప్రవహాం కాళేశ్వరం పంపులను పూర్తిగా నిలిపివేశారు. వరద నీటితోనే ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లు నిండాయి.

You might also like