FbTelugu

సాగర్ బిజెపి అభ్యర్థి రవి నాయక్

హైదరాబాద్: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్ పేరు ఖరారు చేశారు. పలువురి అభ్యర్థిత్వాలను పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం చివరకు రవికుమార్ వైపే మొగ్గు చూపింది.

తనకే టికెట్ దక్కుతుందంటూ కంకణాల నివేదితా రెడ్డి నామినేషన్ వేసినప్పటికీ ఆమె పేరును తిరస్కరించారు. టిఆర్ఎస్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎంసి.కోటిరెడ్డి వస్తే టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ అతను రాకపోవడంతో రవికుమార్ పేరును ఖరారు చేయక తప్పలేదు. త్రిపురారం మండలం పలుగు తండాలో 1985 లో రవికుమార్ పానుగోతు దస్సి, హరి దంపతులకు జన్మించారు. సివిల్ సర్జన్ ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసి సుపరిచితుడిగా పేరొందారు. గతంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. సాగర్ నియోజకవర్గంలో ఎక్కువగా తండాలు ఉండడంతో, గిరిజనులు గెలుపోటములు శాసించే స్థితిలో ఉండడంతో నాయక్ ను ఎంపికచేసినట్లుగా సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.