FbTelugu

సాగర్ బిజెపి అభ్యర్థి నివేదితా రెడ్డి

హైదరాబాద్: నాగార్జున సాగర్ బిజెపి అభ్యర్థిగా కంకణాల నివేదితా రెడ్డి పేరు ను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. టీఆర్ఎస్ నాయకుడు ఎంసి.కోటిరెడ్డి పేరు విన్పించినప్పటికీ చివరకు నివేదితా రెడ్డి వైపే మొగ్గు చూపారు.

పార్టీ నాయకత్వం తన పేరును ఖరారు చేయనప్పటికీ ఆమె రెండ రోజుల క్రితం తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందచేశారు. పార్టీ నాయకత్వం రవి నాయక్, కడారి అంజయ్య యాదవ్ పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు ఆమెనే ఎంపిక చేశారు. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 2675 ఓట్లు మాత్రమే వచ్చాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.