FbTelugu

సాగర్ బిజెపి అభ్యర్థి కోటిరెడ్డి?

హైదరాబాద్: నాగార్జున సాగర్ బిజెపి అభ్యర్థిగా ఎంసి.కోటిరెడ్డి పేరు ఖరారు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. టిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన దక్కే అవకాశాలు కనుచూపు మేరలో లేకపోవడంతో ఆయన బిజెపి వైపు వెళ్లాలని నిర్ణయించకున్నట్లు తెలిసింది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో ఆశావహులు ఎవరి దారులు వారు చూసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గా మాజీ మంత్రి కె.జానారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ టిఆర్ఎస్, బిజెపి లు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ దాఖలు కు కొద్ది గంటల ముందు టిఆర్ఎస్ అభ్యర్థిని సిఎం కెసిఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టికెట్ ఆశించిన ఎంసి.కోటిరెడ్డి తనకు భంగపాటు తప్పదని భావించి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.

నాగార్జున సాగర్ టిఆర్ఎస్ అభ్యర్థి గా మాజీ ఎమ్మెల్యే, దివంగత నోముల నర్సింహ్మయ్య కుమారుడు భగత్ పేరును సిఎం కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది.
ఇప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎంసి.కోటిరెడ్డి బిజెపి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. టికెట్ ఎంపికలో జగదీశ్ రెడ్డి ప్రమేయం లేకపోవడం, మాజీ ఎమ్మెల్యే కుమారుడికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించడం కోటిరెడ్డికి మింగుడు పడలేదు. మంత్రి పరోక్ష సంకేతాలతోనే బిజెపిలోకి వెళ్లేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గడువు కూడా దగ్గర పడుతుండడంతో బిజపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో సంప్రదింపులు జరిపారు. ఇవాళ సంజయ్ సమక్షంలో కోటిరెడ్డి పార్టీ కండువా కప్పుకుని బీ ఫారం తీసుకోనున్నట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.