FbTelugu

ఆకలి తీర్చేందుకు కుక్కల బలి

ప్యోంగాంగ్: ఉత్తర కొరియా ఆహార కొరత తీవ్రంగా ఉంది. వేలాది కుటుంబాలు అర్థాకలితో జీవిస్తున్నాయి. కొన్ని కుటుంబాలు అయితే రోజుల తరబడి ఆహారం దొరక్క పస్తులుంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కిమ్ పెంపుడు కుక్కలపై పడ్డారు.
ఆహార కొరత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలకు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉపక్రమించారు. ఈ మేరకు ఆయన పెంపుడు కుక్కలను అన్నింటిని ఇచ్చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. కిమ్ ఆదేశంతో పెంపుడు కుక్కల యజమానుల గుండె జారిపోయింది. అపురూపంగా పెంచుకుంటున్న కుక్కలను ఇవ్వడమేంటనీ మధనపడుతున్నారు.

మన దేశంలో మాదిరి ఇవ్వం అంటే అక్కడ కుదరదు. అధ్యక్షుడి ఆదేశాలను పాటించాల్సిందే. కుక్కలను అయినా అయినా ఇవ్వండి లేదా రూ.10వేల విలువైన బియ్యం అయిన ఇవ్వాలని షరతు విధించారు. కిమ్ ఆదేశం మేరకు అధికారులు పెంపుడు కుక్కల జాబితాను రూపొందించే పనిలో తలమునకలై ఉన్నారు. దక్షిణ కొరియాలొ పెంపుడు కుక్కల మాంసాన్ని ఇష్టంగా తింటారు.
కుక్కల పెంపకం అనేది పెట్టుబడిదారి, బూర్జువా విధానాలకు ప్రతిబింబం అనేది కిమ్ వాదన. కుక్కలను పోషించడం అనేది అస్సలు నచ్చదు. 2018 సంవత్సరంలో కూడా కుక్కలను ఇలాగే స్వాధీనం చేయాలని కిమ్ ఆదేశించి అమలుపర్చారు.

You might also like