FbTelugu

సచిన్ పైలట్ ఆఫీసు మూత

జైపూర్: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కార్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మూసివేశారు.
ఆయన కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ చర్యకు దిగారు. సచిన్ నిర్వహిస్తున్న పంచాయత్ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయం, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం రెండు రోజులు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసులు సోమవారం నాటికి 24392కు చేరుకోగా, 510 మంది చనిపోయారు. రాజస్థాన్ ప్రభుత్వం మైనార్టీ లో పడిందని సచిన్ పైలట్ తన వాట్సప్ గ్రూప్ లో తెలిపారు.

You might also like