FbTelugu

సచిన్ పైలట్ పై కాంగ్రెస్ వేటు

ఢిల్లీ: తిరుగుబాటు నాయకుడు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.

పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. సీఎల్పీ సమావేశానికి రాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డంతో చర్యలు తీసుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. సోమవారం జరిగిన సీఎల్పీ సమావేశంతో పాటు మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీకి గైర్హాజరు కావడంతో చర్యలకు ఉపక్రమించినట్లు పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. అదే విధంగా పెట్టిన డిమాండ్లకు తలవంచకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.