FbTelugu

హైకోర్టులో సచిన్ పైలట్ కు ఊరట

జైపూర్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ కు ఊరట లభించింది. సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన హైకోర్టు ఈ నెల 24 వరకు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే సచిన్ పైలట్ సహా 18 మందికి స్పీకర్ అనర్హత నోటీసులు పంపాడు.

You might also like