FbTelugu

జమ అవుతున్న రైతు బంధు డబ్బులు

హైదరాబాద్: రైతు బంధు పథకం కింద లబ్ధిదారులకు తొలి రోజు రూ.516.95 కోట్లు జమ చేసింది. 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో రూ.1.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు బదిలీ అయ్యాయి.

అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9,628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు చెందిన 16 లక్షల 95 వేల 601 మంది రైతుల ఖాతాలకు డబ్బులు వేశారు. రెండవ రోజు రెండు ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకు గాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1152.46 కోట్లు జమ కానున్నాయి. రెండవ రోజూ కూడా నల్గొండ రైతులే అత్యధికంగా ఒక లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు జమకానున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.