మాస్కో: తనకు కరోనా పాజిటివ్ సోకిందని, సెల్ఫ్ ఐసోలేట్ కు వెళ్తున్నానని రష్యా ప్రధాని మిఖాయిల్ మిషిస్టున్ ప్రకటించారు.
ఐసోలేషన్ లో డాక్టర్ల సలహాలు పాటిస్తానని స్పష్టం చేశారు. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ ఆండ్రే బెలసోవ్ యాక్టింగ్ పీఎం గా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వ నిర్ణయాల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటూ అధ్యక్షుడు పుతిన్, ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆకాంక్షించారు.