FbTelugu

అంబారీ పై నగ్న స్వారీ

మాస్కో: ఏనుగు ఎక్కి ఊరేగాలని అందరికీ కోరిక ఉంటుంది. ఎనుగు కన్పించినప్పుడు మావటి సాయంతో ఆ కోరికను తీర్చుకుంటారు. కాని ఒక యువతి నగ్నంగా ఏనుగు పై ఊరేగి అశ్చర్యపరిచింది.

రష్యాకు చెందిన అలెస్య కఫెల్కికోవా అనే మోడల్ సుమత్రా ఏనుగు మీదకు ఎక్కేసింది. అది కూడా ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో. ఎవరేమి అనుకుంటే నాకేంటి అంటూ అమ్మడు అంబారీపై నగ్నంగా పడుకుని వీడియో తీసుకున్నది. ఆపై దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ లో పోస్టు చేయడంతో నెటిజన్లు తెగ చూస్తున్నారు. కాగా, ఆ వీడియోను చూసిన పలువురు చివాట్లు పెడుతున్నారు. జంతు ప్రేమికులు అయితే తిట్ల దండకం అందుకుంటున్నారు. నిన్న గుడ్డ పోగులు లేకుండా చూడాలని ఎవరైనా ఆరాపడుతున్నారా, ఏంటా పిచ్చి వేషాలు అంటూ కొందరు మండిపడ్డారు. ముందుగా గజరాజు మీద నుంచి కిందికి దిగు, నీ నగ్న ఫొటోల కోసం ఏదైనా మార్గం వెతుక్కోమంటూ హితవు పలికారు మరికొందరు నెటిజన్లు. వీడియో వైరల్ సంగతి అటుంచి, తిట్ల దండకం చూసిన అమ్మడు తన ఖాతా నుంచి ఆ వీడియోను తీసేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.