FbTelugu

పాలకులకు మెరిట్ ఉండాలి: ఈటల

హైదరాబాద్: దేశంలో మెరిట్ లేకుండా ఏ సీటు రాదు.. అలాగే మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగాన్ని అర్దం చేసుకోగలగడమే ఆ మెరిట్ అని స్పష్టం చేశారు.

ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ అది సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అందుకే మనం బిసి క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నామని ఈటల వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో జరిగిన బిసి ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. సంపద వ్యక్తుల వద్ద కేంద్రీకరించడమే పేదరికానికి కారణమన్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పొదన్నారు. ఎలుకల బాధకు ఇల్లుని తగలబెట్టుకోవద్దని ఈటల అన్నారు.

ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఉద్యమాలు ప్రజలకోసం చేస్తే వారికి గొంతు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేను రాజకీయాలు మాట్లాడటం లేదని, అన్నం పెట్టే రైతుల కోసం మాట్లాడుతున్నానని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల కోరారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడే వాళ్ళమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలని, దేశ పౌరిడిగా, సగటు మనిషిగా స్పందించాల్సిన బాధ్యత ఉందని ఈటల అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.