FbTelugu

నిమిషాల్లో కూలింగ్ టవర్లను కూల్చేశారు…

లండన్: యూరప్ దేశాలు పర్యావరణానికి పెద్దపీట వేస్తాయి. పౌరులకు ఏమాత్రం హాని కలుగుతుందని తెలిసినా, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నదని గమనించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు.

ఇంగ్లండ్ లోని స్టాఫర్డ్ షైర్ లో రుగ్లి పవర్ స్టేషన్ ఉంది. బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్ ను రివర్ ట్రంట్ సమీపంలో 1956 లో ప్రారంభించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ బోర్డు, నేషనల్ కోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాయి. కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని, పర్యావరణానికి చేటు కలిగిస్తుందని నివేదికలు రావడంతో అక్కడి ప్రభుత్వం 2016లో థర్మల్ పవర్ స్టేషన్ ను మూసివేసింది. ఆ ప్రాంతంలో వ్యాపార, నివాస సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎత్తైన కూలింగ్ టవర్లను కూల్చేందుకు ఆధునిక సాంకేతిక విధానాన్ని ఉపయోగించారు. ఒకేసారి నాలుగు టవర్లను నిమిషాల్లో కూల్చేశారు. ఒక్కో టవర్ ఎత్తు 117 మీటర్లు. విద్యుత్ కేంద్రం పనిచేసిన సమయంలో గంట సమయంలో 60 లక్షల గ్యాలన్ల నీటిని చల్లబరిచేవి ఇవి. కూల్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

 

 

You might also like

Leave A Reply

Your email address will not be published.