FbTelugu

టవరెక్కిన ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్: సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాన్చుడు వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు టీవీ టవర్లు, మొబైల్ టవర్లు ఎక్కుతున్నారు. ఇవ్వాళ సాయంత్రం మలక్ పేటలోని టీవీ టవర్ ఎక్కి ఒక కార్మికులు ఆందోళన చేపట్టాడు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశాడు. విషయం తెలుసుకున్న మలక్ పేట పోలీసులు టీవీ టవర్ ప్రాంతానికి చేరుకున్నారు. సహచర కార్మికుడికి మద్దతుగా టీవీ టవర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేరుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. టీవీ టవర్ దిగాలి అంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో ఒక ఉద్యోగి జియో టవర్ ఎక్కాడు. డిమాండ్లు పరిష్కరించడం లేదంటూ ఆత్మహత్య కి ప్రయత్నించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆర్టీసీ ఉద్యోగిని రక్షించారు.

You might also like