FbTelugu

హైదరాబాద్ లోనూ బస్సులు రోడ్డెక్కనున్నాయా?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా నేపథ్యంలో రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఇప్పటికే బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోనూ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం నగరంలో 3వేల ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ పేర్కొంది.

బస్సుల్లో 30 మందికే ప్రయాణ అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని ఉద్యోగులకు కాల్స్ చేసినట్టు సమాచారం.

You might also like