FbTelugu

కొలిక్కి రాని ఆర్టీసీ చర్చలు

విజయవాడ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఏపీఎస్ ఆర్టీసీ ఒక లక్షా 60 వేల కిలోమీటర్లకు రూట్ మ్యాప్ ను తెలంగాణ ఆర్టీసీ అధికారులకు పంపింది. తొలుత 2.6 లక్షల కిలోమీటర్లు తిప్పుతామని ఏపీ ప్రతిపాదన పెట్టింది.

కాగా ఏపీ ప్రతిపాదనను తెలంగాణ అంగీకరించకపోవడంతో 2.08 లక్షల కిలోమీటర్లు తిప్పుతామంటూ మరో చర్చలో తెలిపింది. ఈ నిర్ణయానికి కూడా ససేమీరా అన్న తెలంగాణ 1.60 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిప్పాలంటూ షరతు పెట్టింది. ఎట్టకేలకు 1.60 లక్షల కిలోమీటర్లకు ఏపీ మరో సారి రూట్ మ్యాప్ ను పంపింది. రెండు మూడు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.