FbTelugu

ఇంటి వద్దకే ఆర్టీసీ పార్శిల్‌-కార్గో సేవలు

హైదరాబాద్‌: ఇప్పటి వరకు కలెక్షన్‌ పాయింట్ల వద్దే ఆర్టీసీ పార్శిల్‌-కార్గో సేవలు ఉండేవని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. ఇక నుంచి నేరుగా వినియోగదారుని ఇంటి వద్దకే ఆర్టీసీ పార్శిల్‌-కార్గో సేవలు ప్రారంభించినట్లు చెప్పారు.

ఖైరతాబాద్‌లో డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించిన అనంతరం పువ్వాడ విలేకర్లతో మాట్లాడుతూ.. డోర్‌ డెలివరీ సేవలతో ఆర్టీసీకి రోజుకి రూ.13లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో మూడు నెలలపాటు పార్శిళ్లను ఇంటింటికి పంపిణీ చేసే వ్యవస్థకు శ్రీకారం చుట్టామని పువ్వాడ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.