FbTelugu

కొలువుపై బెంగ.. మతిస్థిమితం కోల్పోయి వింత చేష్టలు

rtc-job-tenction-man-Lost-insanity-strange-acts

సంగారెడ్డి: ఓ పక్క ఆర్టీసీ జేఏసీ నాయకులు చేపట్టిన సమ్మెను విరమించేది లేదని పట్టు బట్టారు.. మరోపక్క మీరు స్వయంగా ఉద్యోగాలు వదులుకున్నట్టే అని కేసీఆర్ ప్రకటించాడు.. దీంతో సామాన్య ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇలా ఓ ఆర్టీసీ కార్మికుడు.. ఒకవేళ కొలువులోకి తీసుకోకుంటే ఇల్లు గడిచేదెట్లా అంటూ ఆలోచిస్తూ.. ఆఖరికి మతిస్థిమితం కోల్పోయి.. పిచ్చి పిచ్చిగా ప్రవర్థించిన ఘటన నారాయణఖేడ్‌ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని జోగిపేటకు చెందిన పులబోయిన నాగేశ్వర్‌ (45) అనే కండక్టర్‌కు నాగేశ్వర్‌ నారాయణఖేడ్‌ డిపోలో పనిచేస్తున్నాడు. భార్య సుజాత, ఇద్దరు కుమారులతో కలిసి సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా వేతనం రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. సీఎం విధించిన గడువు కూడా ముగియండంతో నాగేశ్వర్‌ మరింత ఆందోళన చెందాడు. బుధవారం ఒక్కసారిగా ఏదేదో మాట్లాడటం మొదలు పెట్టాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

You might also like