FbTelugu

ఆర్టీసీకి నయాపైస బాకీ లేదు: హైకోర్టులో అఫిడవిట్

RTC-has-no-dues-says-Affidavit-in-High-Court

హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నయాపైస బకాయి లేదని, ఆర్టీసీయే రూ.540 కోట్లు బకాయి పడిందని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ లో దాఖలు చేసింది. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే రూ.3903 కోట్లు చెల్లించిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థిని బట్టి ఆర్టీసీకి సాయం చేస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అఫిడవిట్ లో తెలిపారు. 2014-15లో మిగులు బడ్జెట్ ఉండడంతో నిధులు చెల్లించామని, ఆ మరుసటి సంవత్సరం నుంచి లోటు బడ్జెట్ లోఉండడం మూలంగా చెల్లించలేదన్నారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదని అఫిడవిట్ లో లోకేష్ తెలిపారు.

You might also like