హైదరాబాద్: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలంటూ టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగడం, ఉద్యమం ఉధృతం కావడం తదనంతర పరిణామాలు తెలిసిందే.
ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా ఆర్టీసీ పూర్తిగా నష్టపోయి దివాళా తీసింది. ఉద్యోగులు మెట్టు దిగి రావడం, సీఎం కేసీఆర్ కూడా పట్టింపులు లేకుండా వారితో చర్చలు జరిపి తిరిగి విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులకే కరోనా మహమ్మారి విజృంభించడం, లాక్ డౌన్ చర్యల కారణంగా ఆర్టీసి పరిస్థితి పేనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల పెంపు పై సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లలేని పరిస్థితులు కన్పిస్తున్నాయి.
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచలేం టీఎస్ ఆర్టీసీ అధికారుల సీఎం కేసీఆర్ కు నివేదిక అందచేశారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుంటారా లేదా ప్రత్యేక నిధులు మంజూరు చేసి వేతనాలు పెంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు కోసం పీఆర్సీ అమలు చేయనున్న విషయం తెలిసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఉత్కంఠ నెలకొంది.