FbTelugu

మరో ఆర్టీసీ కండక్టర్ మృతి

rtc-conducter-died-by-heart-attack

తెలంగాణలో మరో ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్‌ రవీందర్‌ నాలుగు రోజుల కిందట గుండెపోటుకు గురై పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారు జామున మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన రవీందర్ హన్మకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో విపరీత ఒత్తిడికిలోనైన రవీందర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

You might also like