FbTelugu

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసి బస్సు, కారు ఢీ

ప్రకాశం: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసి బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇవాళ ఉదయం శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తరువాత కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, గంగా భవాని కుటుంబం తిరుగు ప్రయాణం అయ్యింది.

శ్రీశైలం నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు చిన్న ఆరుట్ల బస్సును ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తున్న ఆదినారాయణ రెడ్డి కారు బలంగా ఢీకొట్టింది. వీరందరూ బంధువు పెళ్లికి హాజరై శ్రీశైలంలో దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో సుగుణ, శారద, అశోక్ రెడ్డిలు ఉన్నారు. వీరందరిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలంచి చికిత్స అందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.